మేధావి జగన్‌ గారు.. బోటుని తీయలేడా : నారా లోకేశ్

మేధావి జగన్‌ గారు.. బోటుని తీయలేడా : నారా లోకేశ్
x
Highlights

మేధావి జగన్‌ గారు.. బోటుని తీయలేడా : నారా లోకేశ్ మేధావి జగన్‌ గారు.. బోటుని తీయలేడా : నారా లోకేశ్

గోదావరి బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టినందుకే దళితనాయకుడు హర్షకుమార్‌ను కేసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా అంటూ ఘాటుగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. గోదావరిలో 144 సెక్షన్‌ పెట్టిన మేధావి జగన్‌గారు... బోటుని తీయలేడా.. ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనేందుకు ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలంటూ ట్వీట్‌ చేశారు లోకేశ్.

బోట్ ప్రమాదం వెనుక ఉన్న రహస్యం జలసమాధి చెయ్యాలి అని చూసినంత మాత్రాన నిజాలు దాగవు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్సైకి ఫోన్ చేసి ఆపేసిన బోట్ ని వదిలిపెట్టాలని ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలి. ఈ ఘటన పై సమగ్ర విచారణ జరపాలి. అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories