logo

జగన్ మీ పాలనకు జోహార్లు : నారా లోకేశ్

జగన్ మీ పాలనకు జోహార్లు : నారా లోకేశ్
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నారా లోకేశ్ వరుస ట్వీట్లతో విమర్శలు ఎక్కుబెట్టారు. రాయలసీమలో ఉన్నటువంటి కరువు పరిస్థితులను ప్రస్తవించిన లోకేశ్.. జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ప్రజలకు మాత్రం చిక్క నీళ్లు ఇవ్వలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నారా లోకేశ్ వరుస ట్వీట్లతో విమర్శలు ఎక్కుబెట్టారు. రాయలసీమలో ఉన్నటువంటి కరువు పరిస్థితులను ప్రస్తవించిన లోకేశ్.. జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ప్రజలకు మాత్రం చిక్క నీళ్లు ఇవ్వలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. గత రెండు నెలలుగా దేశంలోనే అత్యల్ప వర్షపాతం రాయలసీమలో నమోదైందని .. రాయలసీమలో కరువు తాండవిస్తోందని.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేకపోవడంతో సీమ జిల్లాల ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీ అవగాహనారాహిత్యానికి ప్రజలు ఇంకెన్నాళ్లు ఇబ్బందులకు గురవ్వాలి ? ప్రజల పట్ల మరీ ఇంత ఉదాసీనతా ? అంటూ ట్వీట్టర్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇకపోతే ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులకు కూలీ దొరకడం లేదని.. పనుల్లేకపోవడంతో కార్మికులు తమ పిల్లలను పస్తులు పడుకోబెడుతున్నారన్నారని మండిపడ్డారు. మీ నేతలు ఇసుక అమ్మకాలతో డబ్బుల మూటలు దోచుకుంటున్నారని,, మీ పార్టీ సానుభూతిపరుల మాటలు ఓసారి వినండి. ఇంత సక్రమంగా నడుస్తున్న మీ పాలనకు జోహార్లు అని సీఎం జగన్‌ను ఉద్దేశించి లోకేశ్ ట్వీట్ చేశారు.


లైవ్ టీవి


Share it
Top