నేను ఎయిడ్స్ డే శుభాకాంక్షలు చెప్పలేదు : నారా లోకేశ్

నేను ఎయిడ్స్ డే శుభాకాంక్షలు చెప్పలేదు : నారా లోకేశ్
x
Highlights

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు తాను...

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు తాను శుభాకాంక్షలు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టు ఫేక్ అని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో 'ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైకాపా సైకో సిండ్రోమ్.

వైఎస్ జగన్ గారు పేటీఎమ్ లో వేసే ఐదు రూపాయిల భిక్షం కోసం ఎంత నీచమైన పనులు అయినా చేస్తారు. జగన్ గారు చేతగాని వాడు అని ఆరు నెలల్లోనే తేలిపోవడంతో మళ్లీ వైకాపా సైకో బ్యాచ్ కి పనిపెట్టారు. నన్ను బదనాం చెయ్యడం కోసం ఏమీ దొరకకపోవడంతో నా పేరుతో ఫేక్ మార్ఫింగ్ పోస్టులు పెట్టించి జగన్ గారు శునకానందం పొందుతున్నారు' అంటూ ట్వీట్ చేశారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories