క్యాబినెట్ తీర్మానంపై స్పందించిన నారా లోకేష్

క్యాబినెట్ తీర్మానంపై స్పందించిన నారా లోకేష్
x
Highlights

ఇవాళ భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.

ఇవాళ భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. అంతేకాదు కడపలో టీడీపీ జిల్లా కార్యాలయానికి కేటాయించిన భూమిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. శాసనమండలిని రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టారు. మండలిని రద్దు చేయాలనుకుంటే ముందుగా ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులైన ఇద్దరిని రాజీనామా చేయించాలని.. అలాగే మిగిలిన ఏడుగురు వైసీపీ ఎమ్మెల్సీల చేత కూడా రాజీనామా చేయించి రద్దు నిర్ణయం తీసుకోవాలన్నారు.

అంతేకాదు.. ప్రజల ఆకాంక్షకు కాకుండా తమ స్వార్థానికీ, ద్వేషానికీ మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన నేతలు చరిత్రలో నియంతలుగానే మిగిలిపోయారని.. తెలుగునేలపై అలాంటి హీన చరిత్రను సొంతం చేసుకుంటున్న మొదటి వ్యక్తి జగనే అని విమర్శించారు. కుల, మత, ప్రాంత, రాజకీయ విభేదాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధిని కోరుకుంటున్న ప్రవాసాంధ్రులు.. అమరావతినే రాజధానిగా కొనసాగించమని విదేశీవీధుల్లో తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం అమరావతిపై కక్ష, ద్వేషంతోనే ముందుకు పోతోంది అని విమర్శించారు లోకేష్.

ఇక మండలి రద్దు ఇప్పట్లో అయ్యేది కాదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు.. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినంత మాత్రాన పార్లమెంటు ఆమోదించదని.. తగిన కారణాలు ఉంటేనే సాధ్యపడుతుందన్నారు. మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసినా.. సెలెక్ట్ కమిటీ అలాగే కొనసాగుతుందని యనమల చెప్పారు. రద్దయ్యే వరకూ మండలికి అధికారాలు ఉంటాయని ఆయన అన్నారు. ఇదిలావుంటే శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానాన్ని స్వయంగా సీఎం జగనే అసెంబ్లిలో ప్రవేశపెట్టారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకు అసెంబ్లీ జరుగుతుందని పరిస్థితి చూస్తే అర్ధమవవుతోంది. మండలి రద్దుపై దాదాపు 30 మంది సభ్యులు మాట్లాడేలా వ్యూహాన్ని రచించింది ప్రభుత్వం. ఈ తీర్మానంపై సీఎం సుదీర్ఘంగా మాట్లాడనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories