క్రిస్మస్ కానుక ఎత్తేసిన వ్యక్తి వైఎస్ జగన్: నారా లోకేశ్

క్రిస్మస్ కానుక ఎత్తేసిన వ్యక్తి వైఎస్ జగన్: నారా లోకేశ్
x
Nara lokesh, YS Jagan (File Photo)
Highlights

క్రిస్మస్ పండుగ సందర్భంగా గుంటూరులోని సెయింట్‌ మ్యాతివ్స్‌ చర్చ్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాల్గొన్నారు.

క్రిస్మస్ పండుగ సందర్భంగా గుంటూరులోని సెయింట్‌ మ్యాతివ్స్‌ చర్చ్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన లోకేశ్.. ద్వేషాన్ని వదిలి సమాజంలో ప్రేమతో జీవించాలని పిలుపునిచ్చారు. దేవుడు ఇచ్చిన శక్తిని సమాజానికి మేలు చేసే విధంగా మార్చుకోవాలని కోరారు, దీనులకు , హీనులకు పేదలకు మన వంతు సాయం అందించాలని కోరారు. మన శత్రువుని కూడా మనం ప్రేమించే స్థాయికి రావాలని అప్పుడే క్రీస్తు కరుణిస్తారని అన్నారు. కాగా ఈ వేడుకలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, గుంటూరు జిల్లా నేతలు పాల్గొన్నారు. మరోవైపు క్రిస్మస్ కానుకను ఇవ్వలేదని సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు లోకేశ్.. ఈ మేరకు ట్వీట్ చేశారు. అందులో..

'వైకాపా ప్రభుత్వం ఉన్న సంక్షేమ కార్యక్రమాలను ఎత్తేస్తోంది. ఉన్న దాంట్లోనే క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకను ఆనందంగా జరుపుకోవాలని, ఆ ప్రభువు కృప మీపై ఉండాలని కోరుకుంటున్నాను.. తనతోపాటు పేదక్రిస్టియన్ సోదరులంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ప్రతీఏడాది క్రిస్మస్ కానుక ఇచ్చిన వ్యక్తి చంద్రబాబునాయుడు గారు. తాను మాత్రమే సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలి పేద క్రిస్టియన్ సోదరులు ఏమైతే నాకేంటి అనుకొని క్రిస్మస్ కానుక ఎత్తేసిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.' అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories