స్పీకర్‌ తమ్మినేనికి నారా లోకేష్‌ బహిరంగ లేఖ

స్పీకర్‌ తమ్మినేనికి నారా లోకేష్‌ బహిరంగ లేఖ
x
Highlights

అగ్రిగోల్డ్‌ ఆస్తులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సంబంధం ఉందని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.....

అగ్రిగోల్డ్‌ ఆస్తులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సంబంధం ఉందని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. దీంతో స్పీకర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.. ఈ క్రమంలో తమ్మినేని సీతారామ్‌కు.. నారా లోకేష్‌ బహిరంగ లేఖ రాశారు. స్పీకర్ తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే.. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. ఒకవేళ ఆరోపణలు నిజం కాదని తేలితే మీరేం చేస్తారో చెప్పాలంటూ స్పీకర్ ను డిమాండ్‌ చేశారు లోకేష్. సభాపతి స్థానంలో ఉండి ప్రతిపక్షనేతపైనా, మండలి సభ్యుడినైన తనపైనా నిందారోపణలు చేయడం స్పీకర్‌ స్థానానికి సముచితం కాదన్నారు. విలువలతో సభ నడిపించి ట్రెండ్‌ సెట్‌ చేస్తానని చెప్పిన స్పీకర్.. అసభ్య పదజాలంతో మాట్లాడే ట్రెండ్‌ సెట్‌ చేస్తారని అనుకోలేదని లోకేష్‌ ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories