సీనియర్ పాత్రికేయులు రాఘవాచారి మృతిపట్ల నారా లోకేశ్ సంతాపం

సీనియర్  పాత్రికేయులు రాఘవాచారి మృతిపట్ల నారా లోకేశ్ సంతాపం
x
Highlights

ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్‌ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో...

ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్‌ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు.. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు..

'సీనియర్ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు శ్రీ రాఘవాచారిగారి మరణం పాత్రికేయరంగానికి తీరనిలోటు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప వ్యక్తి రాఘవాచారిగారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.' అని నారా లోకేశ్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories