మళ్ళీ తప్పులో కాలేసిన నారా లోకేష్

మళ్ళీ తప్పులో కాలేసిన నారా లోకేష్
x
నారా లోకేష్
Highlights

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తప్పులో కాలేశారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తప్పులో కాలేశారు. ఆంధ్రప్రదేశ్ లో nrc ని అమలు చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై లోకేష్ చేసిన ట్వీట్ పై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వైకాపా నాయకులు వారి అధ్యక్షుడు వైఎస్ జగన్ గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని గుర్తించడం మంచిది. పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయటమాత్రం మేము వ్యతిరేకం అని ప్రచారంచేస్తారు.

పార్లమెంటులో సపోర్ట్ చేసి.. ఇప్పుడు కడప సభలో NRC అమలు చెయ్యమని ముఖ్యమంత్రిగారు చెప్తున్నారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కదా, ఎంతకైనా దిగజారుతారు.' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అయితే ట్విట్టర్ లో ఏపీ ప్రభుత్వం జనాభా లెక్కల మీద జారీ చేసిన జీవోను పోస్ట్ చేశారు. దీంతో nrc కి జనాభా లెక్కలకు తేడా తెలుసుకోవాలని లోకేష్ ను ట్రోల్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories