ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన నారా లోకేశ్

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన నారా లోకేశ్
x
నారా లోకేశ్
Highlights

రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మంగళగిరి నుంచి సచివాలయం వరకు ఆర్టీసీ బస్సులో నారా లోకేశ్ ప్రయాణించారు. కార్యక్రమంలో చంద్రబాబు, అచ్చెన్నాయిడు, బాలకృష్ణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రభుత్వం మెజార్టీ ఉందని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటోందని చంద్రబాబు అన్నారు. లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరి నుంచి సచివాలయానికి రూ. 10 ఉన్న టిక్కెట్‌ను రూ. 15 చేశారని విమర్శించారు. ఏటా ప్రజలపై 700 నుంచి 1000 కోట్ల భారం వేసేలా నిర్ణయం ఉందని అన్నారు.

పెంచుకుటూ పోతామని ఎన్నికల ప్రచారంలో జగన్ అంటే.. సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారని అనుకున్నారని తీరా చూస్తే అన్ని ధరలు పెంచుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. కాగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేశాయి. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచారు.. అలాగే ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు పెంచింది. అయితే పల్లెవెలుగులో మొదటి 2 స్టేజీలకు, సిటీఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు చార్జీల పెంపు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories