గీతాంజలి కుటుంబానికి సానుభూతి తెలియజేసిన నారా లోకేశ్

గీతాంజలి కుటుంబానికి సానుభూతి తెలియజేసిన నారా లోకేశ్
x
Highlights

సర్దార్ వల్లభ భాయ్ పటేల్ కు నివాళులు అర్పించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. అలాగే సీనియర్ హీరోయిన్ గీతాంజలి ఇవాళ...

సర్దార్ వల్లభ భాయ్ పటేల్ కు నివాళులు అర్పించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. అలాగే సీనియర్ హీరోయిన్ గీతాంజలి ఇవాళ మృతిచెందారు, ఆమె కుటుంబసభ్యులకు కూడా సానుభూతి తెలియజేశారు లోకేశ్.. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో.. 'భారత జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించి, భారత రాజ్యాంగ రచనాకమిటీ సభ్యునిగా, ప్రాధమిక హక్కుల రూపకల్పనకు విశేష కృషి చేసి, సమైక్య భారతావనికోసం ఉక్కు సంకల్పంతో పోరాడిన యోధుడు సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ దేశభక్తుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను'

అలాగే 'సీతారామ కల్యాణం చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమై, తెలుగింటి సీతగా ఖ్యాతి చెందిన విలక్షణ నటీమణి శ్రీమతి గీతాంజలి గారి మృతి సినీ పరిశ్రమకి తీరని లోటు. గీతాంజలిగారి ఆత్మశాంతికై ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.' అంటూ నారా లోకేష్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories