కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించిన నారా లోకేష్

కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించిన నారా లోకేష్
x
Highlights

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ఆస్తులను ప్రకటించారు..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తన తల్లి నారా భువనేశ్వరి 23 ఏళ్లుగా హెరిటేజ్‌లో పని చేస్తున్నారని, కుటుంబానికి ఆర్థిక స్వాతంత్య్రం కోసమే దీనిని స్థాపించామని లోకేష్ అన్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ఆస్తులను ప్రకటించారు..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తన తల్లి నారా భువనేశ్వరి 23 ఏళ్లుగా హెరిటేజ్‌లో పని చేస్తున్నారని, కుటుంబానికి ఆర్థిక స్వాతంత్య్రం కోసమే దీనిని స్థాపించామని లోకేష్ అన్నారు. దీనిద్వారా నేరుగా 3 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు. అలాగే, మొత్తం అప్పులు కలిపి రూ.26.04 కోట్లుగా ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఆస్తుల్లో నుంచి అప్పులు మినహాయించగా, వారి నికర ఆస్తుల విలువ రూ.93.38 కోట్లుగా తెలిపారు. ఇక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.85 లక్షలు పెరిగాయని తెలియజేశారు.

చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు కాగా అందులో అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని తెలిపారు. ఇక తన తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ ఆస్తి 24 కోట్లు కాగా, బ్రాహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షలు.. ఇక వీరి సంతానం దేవాన్ష్‌ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని వివరించారు. తాము ప్రతి ఏటా ఆస్తులను ప్రకటిస్తున్నామని మమ్మల్ని విమర్శించే ముందు మీ ఆస్తులను ప్రకటించడంటూ వైఎస్సార్సీపీ నేతలకు లోకేష్ సవాల్ విసిరారు. యువరక్తం రావాలనే రాజకీయాల్లోకి వచ్చినట్లు లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories