బొత్స కు తెలియదు, చెప్పినా అర్థం కాదు : నారా లోకేష్

బొత్స కు తెలియదు, చెప్పినా అర్థం కాదు : నారా లోకేష్
x
Highlights

ఈనెల 28న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. రైతులను...

ఈనెల 28న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. రైతులను ముంచి ఇంకా ఏ మొహం పెట్టుకొని ఆ ప్రాంతంలో పర్యటిస్తారని ఎద్దేవా చేశారు. దాంతో బొత్స వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సున్నితంగా కౌంటర్ ఇచ్చారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో బొత్స కు తెలియదు, చెప్పినా అర్థం కాదు : నారా లోకేష్. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి పడిన కష్టం వైకాపా నాయకులకు అర్థం అవుతుంది అనుకోవడం అత్యాశే అవుతుంది. ల్యాండ్ పూలింగ్ దగ్గర నుండి, రైతుల ప్లాట్లు తిరిగి ఇవ్వడం, మౌలిక వసతుల కల్పన వరకూ అన్నీ దేశంలో ఉత్తమ ఆలోచనలుగా ప్రశంసలు అందుకుంటుంటే వైకాపా నేతలు మాత్రం కూర్చున్న చెట్టునే నరికేసుకున్నారు' అని పేర్కొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories