Nara Lokesh: ఒక్క ట్వీట్‌తో మహీంద్రాను ఆకర్షించిన నారా లోకేష్ – ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకై కీలక అడుగు!


Nara Lokesh: ఒక్క ట్వీట్‌తో మహీంద్రాను ఆకర్షించిన నారా లోకేష్ – ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకై కీలక అడుగు!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెదేపా, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది.
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెదేపా, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పన, పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా చురుకుగా ఉండే లోకేష్, తన ట్వీట్స్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఓ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
"మీ విధి, మీ చేతుల్లో" – మహీంద్రా యాడ్‌పై స్పందన
మహీంద్రా గ్రూప్ ఇటీవల "మీ విధి, మీ చేతుల్లో" అనే నినాదంతో తెలుగులో ఓ యాడ్ విడుదల చేసింది. దీన్ని అభినందించిన లోకేష్, ఆ యాడ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మహీంద్రా వాహనాలకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విస్తృత మార్కెట్‌ను హైలైట్ చేశారు.
ఒక్క నిర్ణయం చాలు...
— anand mahindra (@anandmahindra) July 18, 2025
మీ విధి మీ చేతుల్లో ఉంది.
ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండి#MahindraFURIO8
pic.twitter.com/y6QU8KwuRh
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మౌలిక వసతులు, యుద్ధ స్థాయిలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి నేపథ్యంలో మహీంద్రా ప్లాంట్‌ను రాష్ట్రంలో ప్రారంభించాలని ఆయన ప్రతిపాదించారు.
ఆనంద్ మహీంద్రా రిప్లై
నారా లోకేష్ ట్వీట్‌పై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వెంటనే స్పందించారు. “ఏపీలో సోలార్ ఎనర్జీ, మైక్రో ఇరిగేషన్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు మా టీమ్ ఇప్పటికే పరిశీలనలు చేస్తోంది. ఏపీతో భాగస్వామ్యం గర్వంగా ఉంది” అంటూ ఆయన తెలుగులోనే ట్వీట్ చేయడం విశేషం.
ధన్యవాదాలు! ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయి.
— anand mahindra (@anandmahindra) July 19, 2025
We would be proud to be a partner in Andhra Pradesh's journey.
Our teams are already in discussions across multiple sectors, from solar energy to micro-irrigation and of course, tourism.
మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది...ముందు… https://t.co/jdRiAr8o7w
పరస్పర ప్రతిస్పందనలో పెట్టుబడుల సంకేతాలు
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై స్పందించిన లోకేష్ – “ఈవీ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడుల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహక ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది. మీరు ఏపీని తయారీ కేంద్రంగా ఎంచుకుంటే హర్షమే,” అంటూ పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ప్రజల ప్రశంసలు
ఈ పరిణామాలపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. "ఒక్క ట్వీట్‌తో పెట్టుబడి అవకాశాలను తెచ్చిన లోకేష్ యంగ్ నాయకుడిగా నిలుస్తున్నారు" అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



