అమరావతి రైతుల ఉద్యమం కోసం బంగారు గాజులను తీసి ఇచ్చిన భువనేశ్వరి

అమరావతి రైతుల ఉద్యమం కోసం బంగారు గాజులను తీసి ఇచ్చిన భువనేశ్వరి
x
Highlights

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ప్రముఖ పారిశ్రామిక వేత్త నారా భువనేశ్వరి బుధవారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆమె అమరావతిలో...

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ప్రముఖ పారిశ్రామిక వేత్త నారా భువనేశ్వరి బుధవారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆమె అమరావతిలో పర్యటించారు. ఈ సందర్బంగా రైతుల ఉద్యమ కోసం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన రెండు బంగారు గాజులను తీసి ఇచ్చారు. ఎర్రబాలంలో రైతుల దీక్షలో చంద్రబాబుతో పాటు పాల్గొన్న భువనేశ్వరి అప్పటికప్పుడు తన గాజులను ఇచ్చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన భువనేశ్వరి ప్రజలను మరియు వారి సంక్షేమాన్ని ఎల్లప్పుడూ ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబునాయుడు అమరావతి కోసం రేయింబవళ్లు పని చేశారని అన్నారు. చంద్రబాబుకు కుటుంబం రెండవ ప్రాధాన్యత అన్న భువనేశ్వరి రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాడని అన్నారు.

అందువల్లే అమరావతిని అభివృద్ధి చేశాడని భువనేశ్వరి తెలిపారు. ఎర్రబాలెం, కృష్ణయాపాలెం, మందడం గ్రామాల్లో భువనేశ్వరి పర్యటన కొనసాగింది. అమరావతి రైతుల పోరాటం 15 వ రోజుకు చేరుకుంది. వెలగపుడిలో రిలే నిరాహార దీక్షలు జరుగుతుండగా తుల్లూరులో మహా ధర్నాను నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. మరోవైపు, కృష్ణా , గుంటూరు జిల్లాల్లోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. అమరావతిలో ఆందోళన నేపథ్యంలో చంద్రబాబు నూతన సంవత్సర వేడుకలను రద్దు చేసుకుని, అమరావతిలో రైతులతోనే ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories