నేటి నుంచి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' బస్సు యాత్ర

Nara Bhuvaneshwari ‍Nijam Gelavali Bus Yatra from Today
x

నేటి నుంచి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' బస్సు యాత్ర

Highlights

Nara Bhuvaneshwari: ‍నారావారిపల్లె నుంచి ప్రారంభంకానున్న బస్సు యాత్ర

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ నారావారిపల్లె నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నారావారిపల్లెలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించిన అనంతరం.. ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నిజం గెలివాలి పేరుతో భువనేశ్వరి బస్సుయాత్ర చేయనున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ బస్సు యాత్ర ద్వారా ఆమె పరామర్శిస్తారు. చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది పాకాల మండలం నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ సెప్టెంబర్ 25న మృతి చెందారు. చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17న ప్రాణాలు కోల్పోయారు.

వారి కుటుంబాలను ఇవాళ భువనేశ్వరి పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నారావారిపల్లెలో మహిళలతో భువనేశ్వరి సమావేశం కానున్నారు. అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అగరాలలో చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భువనేశ్వరి ప్రసంగిస్తారు. ఇక.. రేపు తిరుపతి, ఎల్లుండి శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు భువనేశ్వరి. శ్రీకాళహస్తిలో పలు కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. నిజం గెలవాలి యాత్రకు సంబంధించిన బస్సుపై ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వరి ఫొటోలతో కూడిన థీమ్ ఉంది. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories