విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ అరెస్టు

విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ అరెస్టు
x
Highlights

రాజమండ్రి ఆదికవి నన్నయ యూనవర్సిటీలో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడనే.. ఆరోపణలతో ఇంగ్లిష్‌ విభాగాధిపతి నిమ్మగడ్డ సూర్యరాఘవేంద్రను అరెస్టు చేశారు పోలీసులు.. ఈ మేరకు కీచక ప్రొఫెసర్ ను

రాజమండ్రి ఆదికవి నన్నయ యూనవర్సిటీలో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడనే.. ఆరోపణలతో ఇంగ్లిష్‌ విభాగాధిపతి నిమ్మగడ్డ సూర్యరాఘవేంద్రను అరెస్టు చేశారు పోలీసులు.. ఈ మేరకు కీచక ప్రొఫెసర్ ను అరెస్టు చేసిన విషయాన్నీ స్థానిక సీఐ ఎంవీ సుభాష్‌ తెలిపారు. అతనిపై 489/2019 యు/సెక్షన్స్, 354 (ఏ), 354 (డి), 509, 506 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు తెలిపారు. కాగా కొంతకాలంగా విద్యార్థినుల సెల్‌ఫోన్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడమే కాకుండా కొందరు విద్యార్థినులను తన రూమ్ కు రమ్మనేవాడని రిజిస్టార్‌ ఆచార్య ఎస్‌. టేకి ఫిర్యాదు చేశారు.

దీనిపై ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా సీరియస్ అయ్యారు.. సీఎం కు కూడా కంప్లైంట్ చేశారు. ఈ కేసులో ప్రత్యేక విచారణాధికారిగా వ్యవహరించిన మహిళ ఎస్సై శ్రావణి కృష్ణా జిల్లా నందిగామలోని అతని ఇంట్లో నిందితుణ్ణి అరెస్టు చేసి, రాజమహేంద్రవరానికి తీసుకువచ్చారన్నారు. కాగా ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ కు కూడా విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories