బాలయ్య ఫైర్.. గ్రామాల్లో వైసీపీ నేతలు కక్షలు రేపుతున్నారు...

Nandamuri Balakrishna Fires on YCP | YS Jagan | TDP | Live News
x

బాలయ్య ఫైర్.. గ్రామాల్లో వైసీపీ నేతలు కక్షలు రేపుతున్నారు...

Highlights

Nandamuri Balakrishna: టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తిరుగబడుతారు - బాలకృష్ణ

Nandamuri Balakrishna: వైసీపీ నేతలు గ్రామాల్లో కక్షలు రేపేవిధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కర్నాటక సరిహద్దు కోడికొండ గ్రామంలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే బాలకృష్ణ..పోలీసుల తీరుపై మండిపడ్డారు. తాను వచ్చే దారిలో తన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు.

మరోసారి కార్యకర్తల జోలికి వస్తే వారంతా తిరగబడతారని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని..అంతా బాదుడే బాదుడుని విమర్శించారు. మట్టి దగ్గర నుంచి ప్రతీ దాంట్లో దోపిడీ పర్వమే కొననసాగుతోందని బాలకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయని..ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories