నాగార్జున సాగర్‌కు 64 ఏళ్లు పూర్తి.. కాంట్రాక్టర్ ఎవరో తెలుసా..?

నాగార్జున సాగర్‌కు 64 ఏళ్లు పూర్తి.. కాంట్రాక్టర్ ఎవరో తెలుసా..?
x
Highlights

నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రారంభించి నేటికీ 64 సంవత్సరాలు పూర్తయింది. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది అలాగే పొడవులో మొదటిది. తెలంగాణలో...

నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రారంభించి నేటికీ 64 సంవత్సరాలు పూర్తయింది. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది అలాగే పొడవులో మొదటిది. తెలంగాణలో నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఖమ్మం జిల్లా, అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే ఈ బృహత్తర బహుళార్ధక సాధక ప్రాజెక్టుకు.. 1955 డిసెంబర్ 10న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నందికొండ ప్రాంతంలో పునాది వేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ వరకు నీటిని నిలుపుకునేందుకు 26 క్రెస్ట్ గేట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. నందికొండ గ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఉంది. నాగార్జునసాగర్ ప్రాంతము మూడు భాగములుగా విభజించారు. ఆనకట్టకు దక్షిణాన విజయపురి సౌత్ (వీ.పీ.సౌత్) (గుంటూరు జిల్లా), ఆనకట్ట దాటిన వెంటనే ఉత్తరాన పైలాన్ (నల్గొండ జిల్లా), ఉత్తరాన కొండ మీద హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నాయి.

సాగర్ రిజర్వాయర్ నుండి కుడి మరియు ఎడమ కాలువలతో పాటు కేంద్ర జలవిద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ ప్రాజెక్టును 1967 లో మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ ప్రారంభించారు. విజయపురిసౌత్ నుండి, ఆనకట్ట కుడి సొరంగం ద్వారా 392 కిలోమీటర్ల దూరం నీరు ప్రవహిస్తుంది. ఈ మార్గాన 11 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. అయితే వివిధ కారణాలతో సాగు అంత మేర జరగడం లేదు. అలాగే ఎడమ కాలువ నుండి 349 కిలోమీటర్ల పరిధిలో 11 లక్షల ఎకరాలను తడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 22 లక్షల ఎకరాలకు నీరు అందుబాటులో ఉంటుంది. కుడి కాలువకు జవహర్‌లాల్ నెహ్రూ, ఎడమవైపు లాల్ బహదూర్ శాస్త్రి శాస్త్రి అని పేరు పెట్టారు. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్‌గా ప్రసిద్ధి చెందింది. కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి నాగార్జున సాగర్ పనుల్లో కొంతబాగానికి కాంట్రాక్టర్ గా వ్యవహరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories