కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉంది-నాదెండ్ల మనోహర్

కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉంది-నాదెండ్ల మనోహర్
x

నాదేండ్ల మనోహర్ ఫైల్ ఫోటో

Highlights

*అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టారు *అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా బడ్జెట్ ఉంది-నాదెండ్ల

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మోడీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ మూడోసారి బడ్జెట్‌ పాఠం చదివి వినిపించారు. ఈసారి బడ్జెట్‌ ప్రతులకు బదులు ట్యాబ్‌ ద్వారా చూస్తూ చదివారు. కాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పలు రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు స్పందిస్తున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అధికార వైసీపీ తోపాటు ప్రతిపక్ష పార్టీలన్ని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ స్టాడ్ ఎలా ఉంటుందో అని అందరూ భావించారు. కాగా.. జనసేన నేత నాదేండ్ల మనోహార్ బడ్జెట్ పై మాట్లాడారు..

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకని బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు. ఏపీలో ఎకనామిక్ కారిడార్, విశాఖ ఓడరేవు అభివృద్ధికి నిధులు కేటాయించారన్నారు. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా బడ్జెట్ కేటాయించారని అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories