అనంత సాగరంలో మనబడి నాడు-నేడు కార్యక్రమం

అనంత సాగరంలో మనబడి నాడు-నేడు కార్యక్రమం
x
ఎంపీడీవో మధుసూదన్ రావు
Highlights

మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బడి నాడు-నేడు కార్యక్రమం నిర్వహించారు.

అనంతసాగరం: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బడి నాడు-నేడు కార్యక్రమంలో మండల పరిధిలోని 24 పంచాయతీలకు 24 పాఠశాలలు ఎన్నిక కాబడిన ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఎంఆర్పి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో మధుసూదన్ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మధుసూదన్ రావు, మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రధానోపాధ్యాయులు మెలగాలని అన్నారు. గతంలో పాఠశాలలకు విద్యార్థులు రాకుండా స్పందించిన దాఖలాలు ప్రధానోపాధ్యాయులకు లేవని కేవలం ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు పాఠశాలకు హాజరు కాని యెడల తల్లిదండ్రులకు సమాచారం అందించే వారిని తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలో ఎన్నిక కాబడిన 24 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సచివాలయ ఇంజనీర్లు, గ్రామ సచివాలయ వెల్ఫేర్ ఆఫీసర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories