సీఎం జగన్ ను కలిసిన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్

సీఎం జగన్ ను కలిసిన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మక దిశా చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రిలో మొదటి దిశా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మక దిశా చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రిలో మొదటి దిశా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు.. అంతేకాదు దిశా చట్టంపై ప్రత్యేక పాటను విడుదల చేశారు. దాదాపు 9 నిమిషాల నిడివి ఉండే పాట దిశ చర్య గురించి వివరిస్తుంది. ఆడవారు ఏదైనా ప్రమాదానికి గురైతే ఎలా స్పందించాలో కూడా ఇది వివరిస్తుంది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రావు ఈ పాటను ప్రత్యేకంగా రాయించారు. నిన్న ఈ పాటను లాంచ్ చేసిన సమయంలో అనూప్ రూబెన్స్.. ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఈ సందర్బంగా అనూప్ ను అభినందించారు ముఖ్యమంత్రి.

కాగా మహిళల రక్షణ కోసం ఎపి ప్రభుత్వం దిశా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని ఎపి హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మహిళలకు ఎలా భద్రత కల్పించాలనే దానిపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆమె వివరించారు. ఒక దిశా పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారని స్పష్టం చేశారు. వీరంతా మహిళల భద్రత కోసం రోజుకు 24 గంటలు పనిచేస్తారని తెలిపారు. దిశా చట్టం ప్రకారం, అత్యాచారం కేసు నమోదైతే, విచారణను 14 రోజుల్లో పూర్తి చేయాలి.

నేరం యొక్క తీవ్రతను బట్టి నిందితుడికి ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షించబడుతుంది. దీని కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కూడా విడుదల చేసింది. అంతేకాదు ఫోరెన్సిక్ ల్యాబ్ ల ఏర్పాటు, అలాగే ఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరిండం కోసం దాదాపు రూ. 40 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దిశ చట్టంలో కొన్ని సవరణలు చేయడానికి కేంద్రం ఇటీవల ఈ చట్టాన్ని ఏపీకి తిరిగి పంపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories