జగన్‌పై హత్యాయత్నం కేసు.. విజయవాడకు బదిలీ

జగన్‌పై హత్యాయత్నం కేసు.. విజయవాడకు బదిలీ
x
Highlights

రెండు నెలల కిందట ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును...

రెండు నెలల కిందట ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును మొదట ఏపీ పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో లోతైన దర్యాప్తు చెయ్యాలని ఎన్‌ఐఏ కు బదిలీ చేసింది హైకోర్టు. ఈ క్రమంలో కేసును విశాఖపట్నం నుంచి విజయవాడకు బదిలీ చేయాలంటూ మెట్రోపాలిటన్‌ కోర్టు తీర్పునిచ్చింది.

జగన్‌పై హత్యాయత్నం కేసులో ప్రభుత్వం తమకు సహకరించడం లేదని.. ఈ కేసును విజవాడకు బదిలీ చేయాలంటూ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దాంతో మెట్రోపాలిటన్‌ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కేసుకు సంబంధించిన అన్ని ఎవిడెన్స్, రికార్డులను ఎన్‌ఐఏకు అప్పగించాలంటూ మెట్రోపాలిటన్‌ కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories