Tadipatri: కూరగాయలు మార్కెట్ లో గుర్తింపు కార్డులు తనిఖీ

Tadipatri: కూరగాయలు మార్కెట్ లో గుర్తింపు కార్డులు తనిఖీ
x
Highlights

తాడిపత్రి చుక్కలు రోడ్డు కొత్త బ్రిడ్జి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కూరగాయలు మార్కెట్ ను టౌన్ ఎస్ ఐ ప్రదీప్, మున్సిపాలిటీ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి...

తాడిపత్రి చుక్కలు రోడ్డు కొత్త బ్రిడ్జి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కూరగాయలు మార్కెట్ ను టౌన్ ఎస్ ఐ ప్రదీప్, మున్సిపాలిటీ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి ఆకస్మీకంగా తనిఖీ లు నిర్వహించి, ప్రజల గుర్తింపు కార్డులు తనిఖీ లు చేశారు. కరోనా వ్యాధి నివారణ లో భాగంగా కొత్త మార్కెట్ లో ప్రజలు సామాజిక దూరం పాటించాలని,హెచ్చరిక లు జారీచేశారు. తాడిపత్రి పట్టణం లో మున్సిపాలిటీ వారు ఇంటింటికి గుర్తింపు కార్డులు అందచేసినట్లు కమిషన్ తెలిపారు.

లాక్ డౌన్ సమయం లో నిత్యఅవసరాలు కు అత్యవసర సమయం లో బయటకు వచ్చిననప్పుడు, గుర్తింపు కార్డు తో పాటు తమ ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని ఎస్ ఐ ప్రదీప్ తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీ లో మున్సిపాలిటీ ఆర్ ఐ సత్య తదితర అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories