Andhra Pradesh: ఏపీలో రేపే పురపోరు

Municipal Elections in Andhra Pradesh Tomorrow
x

Representational Image

Highlights

Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోన్న అధికారులు * మొత్తం 12 నగరపాలక, 71 మున్సిపాలిటీలకు ఎన్నిక

Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో రేపు పోలింగ్‌ జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పోలింగ్‌ను నిలిచిపోయింది. 75 పురపాలక, నగర పంచాయతీలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా కడప జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల రేపు పోలింగ్ జరగనుంది.

రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలో 78 లక్షల 71 వేల 272 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 7,915 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో సగానికిపైగా సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించిన పోలీసులు.. ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories