ఏపీలో బడ్జెట్ పై ప్రభావం చూపనున్న మున్సిపల్ ఎన్నికలు

Municipal Elections in Andhra Pradesh on next month 10th
x

Representational Image

Highlights

ఏపీలో వచ్చే నెల 10న మున్సిపల్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి ప్రభావం బడ్జెట్‌ సమావేశాలపై పడే అవకాశం కన్పిస్తోంది. ఒకవేళ ఎన్నికలు జరిగే సమయంలో బడ్జెట్‌...

ఏపీలో వచ్చే నెల 10న మున్సిపల్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి ప్రభావం బడ్జెట్‌ సమావేశాలపై పడే అవకాశం కన్పిస్తోంది. ఒకవేళ ఎన్నికలు జరిగే సమయంలో బడ్జెట్‌ సమావేశాలు పెట్టవచ్చా అనే చర్చ కూడా జరుగుతోంది.

ఏపీలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల ప్రభావం బడ్జెట్‌పై పడే అవకాశాలున్నాయి. వచ్చే నెల 31లోపు 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి. అయితే ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికల హడావిడి నడుస్తోంది. దీనికి తోడు మున్సిపల్‌ ఎన్నికలు కూడా వచ్చాయి. ఇప్పటికే మున్సిపల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీకి సవాల్‌గా మారాయి.

ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మున్సిపల్‌ ఎన్నికల బిజీలో ఉన్నారు. సాధారణంగా బడ్జెట్‌ సమావేశాలు మార్చి మొదటి వారంలో ప్రారంభం అవుతాయి. కానీ ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత అంటే మార్చి 15న ఏపీలో బడ్జెట్‌ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది.

గతేడాది కరోనా కారణంగా బడ్జెట్‌ సమావేశాలు ఆలస్యం అయ్యాయి. మూడు నెలల కాలానికి ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. అయితే మార్చి 10కి ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు పెడితే ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరిగితే సంక్షేమంపై హామీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల కోడ్‌ ఉన్న నేపథ్యంలో ఎలాంటి సంక్షేమ పథకాల హామీలు ఇవ్వకూడదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు ఈసారి మార్చి 15 తర్వాత జరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్‌పై అన్ని శాఖలు అధికారులు నుంచి నివేదికలు తీసుకుంది. మార్చి మొదటివారంలో సమావేశాలకు ప్రభుత్వం సిద్దమయ్యింది. అయితే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌ ఈసారి మార్చి 15 తర్వాత జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories