గురజాల వాసుల దశాబ్దాల కల సాకారమైన వేళ

గురజాల వాసుల దశాబ్దాల కల సాకారమైన వేళ
x
Highlights

గురజాల వాసుల దశాబ్దాల కల సాకారమైన వేళ గురజాల వాసుల దశాబ్దాల కల సాకారమైన వేళ

గురజాల వాసుల దశాబ్దాల కల సాకరమైంది. దాచేపల్లి, గురజాల పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ.. మున్సిపల్‌ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలను కలిసి దాచేపల్లి మున్సిపాల్టీగా, గురజాల, జంగమహేశ్వరపురం గ్రామాలను కలిసి గురజాల మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేశారు.

గతంలో జగన్ తన పాదయాత్ర సందర్బంగాదాచేపల్లి, గురజాల పట్టణాలకు మున్సిపాల్టీలల హోదా ప్రకటించారు. దాంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ హామీని నెరవేర్చారు.. కాగా ఇప్పటికే పిడుగురాళ్ల మున్సిపాల్టీగా ఉండటంతో తాజాగా దాచేపల్లి, గురజాల పట్టణాలు కూడా ఆ జాబితాలో చేర్చారు. దాంతో ఒకే నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గంగా గురజాల రికార్డ్ సృష్టించింది. మరోవైపు గురజాల నియోజకవర్గానికి రూ.66 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. ఆ తర్వాత తంగెడ, మాచవరం గ్రామాల పరిధిలో ఎత్తిపోతల నిర్మాణాలకు రూ.188 కోట్ల విడుదల చేస్తుంది ప్రభుత్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories