
గత ఎన్నికల ప్రచారం సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన 'రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న' అనే పాటకు తహసీల్దార్ స్టెప్పులు ఇరగదీశారు....
గత ఎన్నికల ప్రచారం సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన 'రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న' అనే పాటకు తహసీల్దార్ స్టెప్పులు ఇరగదీశారు. శ్రీకాకుళం జిల్లా భామినిలో ఈ ఘటన జరిగింది. వైసీపీ పాటకు తహసీల్దార్ డ్యాన్స్ వేయడం ఆ వీడియో ఎవరో సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అది కాస్త వైరల్ గారిది. ఇకార్తీకమాసం సందర్భంగా భామినిలోని నేరడి బ్యారేజ్ వద్ద వైసీపీ కార్యకర్తలు వనభోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి భామిని తహసీల్దార్ ఎస్.నర్సింహమూర్తి, ఇతర రెవెన్యూ సిబ్బంది ముఖ్య అథిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రచార గీతాలను ప్లే చేశారు. దాంతో ఉత్సాహంతో ఊగిపోయిన ఈ తహసీల్దార్ ఇరగదీసేలా స్టెప్పులేశారు. కార్యకర్తలతో కలిసి మైమరిచిపోయి డ్యాన్స్ చేశారు. అయితే దీనిపై కొందరు విశ్లేషకులు మండిపడుతున్నారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire