AP Elections 2020: ఏపీలో ఎంపీటీసీ నామినేషన్ల సంఖ్య చూస్తే షాకే..

AP Elections 2020: ఏపీలో ఎంపీటీసీ నామినేషన్ల సంఖ్య చూస్తే షాకే..
x
Highlights

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండల పరిషత్తు (mptc) లకు దాఖలైన నామినేషన్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది....

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండల పరిషత్తు (mptc) లకు దాఖలైన నామినేషన్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 13 జిల్లాల మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో మార్చి 11 వ తేదీ ముగిసే నాటికి జిల్లాల వారిగా దాఖలు అయిన నామినేషన్ల ను ప్రకటించింది.

రాష్ట్రంలోని 9696 మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 50063 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు ఆఖరు రోజైన బుధవారం ఒక్కరోజే 45,418 మంది నామినేషన్ లు దాఖలు చేసినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన సంఖ్య చూస్తే ఎంపీటీసీ బరిలోకి భారీగానే దిగినట్టు అర్ధమవుతోంది. ఒక్కో ఎంపీటీసీకి యావరేజిగా లెక్కేసుకున్నా ఐదుగురు నామినేషన్లు వేశారు. అయితే ఇందులో పార్టీకి డమ్మీ అభ్యర్థులు తప్పనిసరిగా ఉంటారు కాబట్టి సంఖ్య అందుకే పెరిగిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అక్కడక్కడా నామినేషన్ ప్రక్రియలో గొడవలు చోటుచేసుకున్నాయని చెప్పారు అధికారులు. కాగా జిల్లాల వారీగా అన్ని పార్టీల నామినేషన్ల సంఖ్య ఇలా ఉంది..

మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్ల సంఖ్య..

1) శ్రీకాకుళం (668) కు గాను 3336,

2) విజయనగరం (549)కు గాను 2733,

3) విశాఖపట్నం ( 651)కు గాను 3714,

4) తూర్పుగోదావరి (1086)కు గాను 5563,

5) పశ్చిమగోదావరి (863)కు గాను 4598,

6) కృష్ణా (723)కు గాను 3671,

7) గుంటూరు (805)కు గాను 3852,

8) ప్రకాశం (742) కుగాను 4115,

9) ఎస్పీ నెల్లూరు ( 554) కుగాను 2832,

10) కర్నూలు (804) కుగాను 4022,

11) అనంతపురం (841)కు గాను 4575,

12) చిత్తూరు (858)కు గాను 4260,

13) వైఎస్ఆర్ కడప (553)కు గాను 2792

నామినేషన్ లు దాఖలు అయ్యాయి. అయితే చివరి రోజు సమయం అయిపోవడంతో చాలా మంది నామినేషన్లు వేయకుండానే వెనుదిరిగారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories