జనసేన అభ్యర్ధుల బి-ఫారాలు టీడీపీ ద్వారానే వెళ్లాయటగా : ఎంపీ విజయసాయిరెడ్డి

జనసేన అభ్యర్ధుల బి-ఫారాలు టీడీపీ ద్వారానే వెళ్లాయటగా : ఎంపీ విజయసాయిరెడ్డి
x
Highlights

మరోసారి టీడీపీ, జనసేన పార్టీలపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టిడిపి అభ్యర్థులను గెలిపించేందుకు కీలక స్థానాల్లో జనసేన డమ్మీ క్యాండిడేట్లను...

మరోసారి టీడీపీ, జనసేన పార్టీలపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టిడిపి అభ్యర్థులను గెలిపించేందుకు కీలక స్థానాల్లో జనసేన డమ్మీ క్యాండిడేట్లను పెట్టిన విషయాన్ని ఎమ్మెల్యే వంశీ బయట పెట్టాడని.. చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ గన్నవరంలో సీపీఐని పోటీకి పెట్టాడని అంత:పుర రహస్యాలు వెల్లడించాయన్నారు. జనసేన అభ్యర్ధుల బి-ఫారాలు కూడా టీడీపీ ద్వారానే వెళ్లాయట. అని అన్నారు.

అలాగే ఇసుక కొరత విషయంలో కూడా రెండు పార్టీలకు చురకలు అంటించారు. విజయసాయి.. నిర్మాణ కార్మికులకు నిజంగా ఉపాధి పోయిందో లేదో కానీ... బాబుకు, ఆయన పార్ట్‌నర్‌కు చేతినిండా పని దొరికిందని సోషల్ మీడియాలో ఒకటే సెటైర్లు. రాంగ్ మార్చ్, ఒక్కపూట నిరాహార దీక్షల కోసం చేసిన ఖర్చుతో కనీసం వెయ్యి కుటుంబాలు ఏడాది కాలం పాటు జీవిస్తాయని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. అని ఎద్దేవా చేశారు.

Keywords : mp vijayasaireddy ,sensational comments, tdp ,janasena


Show Full Article
Print Article
More On
Next Story
More Stories