ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్ : విజయసాయిరెడ్డి

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్ : విజయసాయిరెడ్డి
x
Highlights

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణా కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను పంపించి ఆ పార్టీని కంట్రోల్...

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణా కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను పంపించి ఆ పార్టీని కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏపీలో తన పార్టీని బిజెపిలో విలీనం చేసి నారా లోకేశ్ ను అధ్యక్షుడిగా నియమించేలా స్కెచ్ వేశాడు. మొదటి నుంచి బిజెపీ జెండా మోస్తున్న వారిని ఎదగకుండా అడ్డుకున్నది అందుకే.' అంటూ పేర్కొనగా.. విశాఖ ఏయిర్పోర్టులో రూ. 25 లక్షల తిండి బిల్లుపై కూడా విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబునాయుడు గారి పుత్రరత్నం లోకేశ్ స్నాక్స్ ఖర్చు రూ.25 లక్షలట. నిజంగా లోకేశ్ తిండే ఆ స్థాయిలో ఉంటుందా? ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి దొంగ బిల్లులు సృష్టించాడా? వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామం రూ.25 లక్షల భత్యంతో నెల రోజులు గడుపుతుంది.' అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories