శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు హేళన చేశారు : ఎంపీ విజయసాయిరెడ్డి

శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు హేళన చేశారు : ఎంపీ విజయసాయిరెడ్డి
x
Highlights

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అమరావతి రాజధాని విషయంలో అనవసర రాదంతం చేస్తున్నారని ఆరోపించారు....

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అమరావతి రాజధాని విషయంలో అనవసర రాదంతం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంత నేల స్వభావం, భౌగోళిక స్థితిగతులు భారీ నిర్మాణాలకు అనుకూలం కాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని.. కానీ ఈ కమిటీ నివేదికపై చంద్రబాబు హేళనగా మాట్లాడారని అన్నారు. అమరావతిలో రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ చేసి వంద తరాలకు సరిపడా సంపాదించాలని చంద్రబాబు స్కెచ్ వేశారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఆలోచనతోనే మూడు ప్రాంతాల గురించి ఎన్నడూ ఆలోచించలేదని ఎద్దేవా చేశారు.

అంతేకాదు రాష్ట్ర ప్రజానీకం అఖండ మెజారిటీతో గెలిపించిన వైసీపీ ప్రభుత్వాన్ని'ఇన్ సైడర్లు' ఛాలెంజ్ చేస్తున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం అమరావతిలో వారు మొదలు పెట్టినవన్నీ కొనసాగించాలని చంద్రబాబు మాట్లాడుతున్నారని.. ఇందులో భాగంగా తమకు ఇన్సైడ్ ట్రేడింగ్ ను చంద్రబాబు అంట గట్టడానికి గోబెల్స్ ప్రచారాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు విజయసాయి. కాగా ఇవాళ విశాఖలో పర్యటించిన విజయసాయి పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories