ఇన్నాళ్లు ఈ ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్ళింది..

ఇన్నాళ్లు ఈ ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్ళింది..
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి. వారంరోజుల్లోనే ఇసుక మీద మంచి ఆదాయం వచ్చిందని.....

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి. వారంరోజుల్లోనే ఇసుక మీద మంచి ఆదాయం వచ్చిందని.. అలాంటిది గత ఐదేళ్లలో ఈ ఆదాయం ఏమైపోయిందని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. 'వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే ఇది వేల కోట్లలోకి వెళ్తుంది.

మరి ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది చంద్రబాబు గారూ? పచ్చ ఇసుక మాఫియా ద్వారా మీకూ వాటా ముట్టేది. అందుకే ఇసుక కొరతపై ఇంత రాద్ధాంతం చేశారు.' అని పేర్కొన్నారు. కాగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్నిప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని లోక్‌ సభ స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories