Pilli Subhash Chandra Bose: ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు.. వేణుకు సీటు ఇస్తే నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా

MP Pilli Subhash Chandra Bose Key Comments On Venu
x

Pilli Subhash Chandra Bose: ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు.. వేణుకు సీటు ఇస్తే నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా

Highlights

Pilli Subhash Chandra Bose: వేణు ఆత్మీయ సమావేశానికి నాకు ఆహ్వానం లేదు.. ఉన్నా వెళ్లను

Pilli Subhash Chandra Bose: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి వేణుకు పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉందని.. రామచంద్రపురం నుంచి వేణు బరిలో ఉంటే మద్దతిచ్చే ప్రసక్తి లేదన్నారు. వేణుకు సీటు ఇస్తే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని.. తమ కుటుంబం నుంచి పోటీ చేయాలని క్యాడర్ కోరుతున్నారన్నారు. వేణు ఆత్మీయ సమావేశానికి తనకు ఆహ్వానం లేదని.. ఉన్నా వెళ్లనని తేల్చి చెప్పారు. తన క్యాడర్‌ను మంత్రి వేణు ఇబ్బందులకు గురిచేశారన్నారు. సమయం వచ్చినప్పుడు క్యాడర్ కచ్చితంగా సమాధానం చెప్తారన్నారు. క్యాడర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని.. పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలు చెప్పానన్నారు.

ఇక పిల్లి బోస్ వ్యాఖ్యలపై మంత్రి వేణు స్పందించారు. మండలి రద్దు అవ్వదని తెలిసి బోస్‌ను... మంత్రిగా కంటిన్యూ అవుతావా అని జగన్ అడిగారన్నారు. అనుచరుల వల్లే బోస్‌కి అపకీర్తి, మచ్చ వస్తుందన్నారు. పార్టీకి నష్టం చేసే వారిని కచ్చితంగా దూరం పెడతానన్నారు మంత్రి వేణు. తల్లి లాంటి పార్టీని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని.. ఓడిపోయినా బోస్‌ను వదలలేదన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చాడు, మంత్రి, రాజ్యసభ ఇచ్చాడని గుర్తు చేశాడు మంత్రి వేణు.

Show Full Article
Print Article
Next Story
More Stories