బీజేపీ, టీడీపీ ల పేర్లు మార్చిన ఇద్దరు నేతలు

బీజేపీ, టీడీపీ ల పేర్లు మార్చిన ఇద్దరు నేతలు
x
Highlights

ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి బీజేపీపై విమర్శలు చేశారు. ఈ ఆ పార్టీని బీజేపీ.. భారతీయ జోకర్స్ పార్టీ'గా అభివర్ణించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్...

ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి బీజేపీపై విమర్శలు చేశారు. ఈ ఆ పార్టీని బీజేపీ.. భారతీయ జోకర్స్ పార్టీ'గా అభివర్ణించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'బీజేపీ, భారతీయ జోకర్స్ పార్టీగా మారింది. ఆంధ్రప్రదేశ్ కి నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్న మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేసే దమ్మూ, ధైర్యం లేని బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ ద్వారానే కౌంటర్ ఇచ్చారు.. 'టీడీపీ, "టోటల్ దొంగల పార్టీ"గ ప్రజలకు తెలిసిపోయింది. ఆంధ్ర ప్రజలనోట్లో మట్టికొట్టి జేబులు నింపుకున్న చంద్రబాబుగారి ముందే కదా నిరసన చేయవలసింది! లక్షల కోట్ల అవినీతి చేసిన ముఖ్యమంత్రిని నిల దీస్తూనే ఉంటాం.అధికార అహంకారానికి ఎన్నికల ఓటమితో పాటు చరిత్ర హీనులుగా మిగులుతారు' అంటూ రీట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories