పోలీసులను ముప్పుతిప్పలుపెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించిన పడాల్ దొరికాడు

పోలీసులను ముప్పుతిప్పలుపెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించిన పడాల్ దొరికాడు
x
Highlights

గంజాయి స్మగ్లర్ కానిస్టేబుల్ పడాల్ ఎట్టకేలకు దొరికాడు. వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయిన పడాల్​ గంజాయి స్మగ్లర్ అవతారం ఎత్తి దొంగగా మారి పోలీసులను...

గంజాయి స్మగ్లర్ కానిస్టేబుల్ పడాల్ ఎట్టకేలకు దొరికాడు. వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయిన పడాల్​ గంజాయి స్మగ్లర్ అవతారం ఎత్తి దొంగగా మారి పోలీసులను పరిగెత్తించ్చాడు. అతగాడి చేష్టలకు ఒక ఏఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. గతంలో చాలా నేరాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అతను చిక్కినట్టే చిక్కి పరారవుతున్నాడు. గన్నవరం నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్న గంజాయి స్మగ్లర్ అవతారం ఎత్తాడు పడాల్.. అప్పటినుంచి పోలీసులను ముప్పుతిప్పలుపెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించాడు. అయితే చివరకు విజయనగరం జిల్లా నరవస గ్రామంలో పడాల్ తిరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గతనెల 19న రిమాండులో భాగంగా గన్నవరం నుంచి రాజమండ్రి జైలుకు బస్ లో తరలిస్తుండగా తప్పించుకున్నాడు. గతంలో ఒకసారి చింతపల్లిలో సిఐ గన్ ఎత్తుకెళ్లిన కేసు కూడా పడాల్ పై ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories