తిరుమలకు మోనో రైలు !

తిరుమలకు మోనో రైలు !
x
తిరుమలకు రైలు
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు త్వరలోనే శుభవార్త అందించనుంది. తిరుపతి నుంచి తిరుమలకు రైలు ప్రతిపాదన పరిశీలించస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు త్వరలోనే శుభవార్త అందించనుంది. తిరుపతి నుంచి తిరుమలకు రైలు ప్రతిపాదన పరిశీలించస్తోంది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు మోనో రైలు, లైట్ మెట్రోలను పరిశీలిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో దీని గురించి చర్చించామని పేర్కొన్నారు. దీనిపై నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు. మోనో రైలు ఆస్ట్రియాలో ఎత్తైన కొండపైకి వెళ్తోందని, అదే మోడల్‌గా తీసుకుని తిరుమలకు మోనో రైలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామంటున్నారు.

మోనో రూలు రెండు భక్తులు నడిచే మార్గాలు, రెండు ఘాట్ రోడ్లలోనే నిర్మించే విధంగా పరిశీలిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు ఇటీవల హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చర్చలు జరిపారు. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ప్రతిపాదనలపై చర్చించారు. 7 కొండల్లో ఎలాంటి టన్నెల్ తవ్వకుండా.. ఉన్న మార్గాల్లోనే మోనో రైలు అవకాశాలు కోరామని ఆయన అన్నారు. మోనో రైలు అవకాశాలను ప్రధానంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. రోప్‌వేలో కేబుల్ కార్లు లాంటివి వద్దని వివరించామని, నివేదిక కూడా కోరామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత.. ఈ రైలు అంశంపై అవసరమైతే ఆగమపండితులతో చర్చిస్తామని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories