Moddu Seenu Murder Case Convict Died: మొద్దు శ్రీను హత్యకేసు నిందితుడు ఓం ప్రకాశ్‌ మృతి

Moddu Seenu Murder Case Convict Died: మొద్దు శ్రీను హత్యకేసు నిందితుడు ఓం ప్రకాశ్‌ మృతి
x
Moddu Seenu Murder Case Convict Died
Highlights

Moddu Seenu Murder Case Convict Died: జూలకంటి శ్రీనివాసరెడ్డి అలియాస్ మొద్దుశీను హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఓం ప్రకాష్ మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఓం ప్రకాష్ సోమవారం విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు

Moddu Seenu Murder Case Convict Died: జూలకంటి శ్రీనివాసరెడ్డి అలియాస్ మొద్దుశీను హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఓం ప్రకాష్ మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఓం ప్రకాష్ సోమవారం విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల రవీంద్ర హత్య కేసులో నిందితుడైన మొద్దుశీనును 2008 నవంబర్ 9న అనంతపురం జిల్లా జైలులోనే డంబెల్ ‌తో‌ మోదీ హత్య చేశాడు. జైలు గదిలో రాత్రివేళ రోజు లైట్ ఆర్పకుండా ఉంటున్నాడని మొద్దు శీను గొడవపడటంతో కోపోద్రిక్తుడైన ఓం ప్రకాష్ శీనును హత్య చేశాడన్న విషయం అప్పట్లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవిత ఖైదు విధించింది. దీంతో 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైలులో ఓం ప్రకాశ్‌ శిక్ష అనుభవిస్తున్నాడు.

అయితే అతను కొంతకాలం నుంచి అనారోగ్యం భారిన పడ్డాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం మృతి చెందినట్టు జైలు అధికారులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. మరోవైపు ఓం ప్రకాష్ మృతిచెందాడన్న వార్త తెలియగానే అతని కుటుంబ సభ్యులు విశాఖ జైలు వద్దకు చేరుకున్నారు. అతని తనయుడు సాయి కుమార్ తన తండ్రి ఇంకా కొన్ని రోజులు జీవిస్తారని అనుకున్నానని కానీ అనుకోకుండా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా‌ పరీక్షలో నెగిటివ్ వస్తే తన తండ్రి మృతదేహాన్ని సొంత ఊరు తీసుకుని వెళ్తామని సాయికుమార్ తెలిపారు. ఓం ప్రకాశ్‌ తల్లి సరోజనమ్మ కూడా ఈ ఏడాది ఏప్రిల్ ‌మృతిలో మృతిచెందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories