టీఆర్ఎస్ ఎంపీ ఛాలెంజ్ ను స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

టీఆర్ఎస్ ఎంపీ ఛాలెంజ్ ను స్వీకరించిన ఎమ్మెల్యే రోజా
x
Highlights

తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. బిగ్ బాస్ షో ఫేం భాను శ్రీ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను...

తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. బిగ్ బాస్ షో ఫేం భాను శ్రీ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురష్కరించుకొని నగరి పట్టణంలో మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరి పీసీఎన్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అందరం నడుం బిగించాలని.. అందుకు ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు.

దాని వల్ల భారతదేశంతోపాటు తెలుగు రాష్ట్ర్రాలు పచ్చదనంతో ఉంటాయని చెప్పారు. కేవలం మొక్కలు నాటడం తోనే పని పూర్తి కాదన్న రోజా.. వాటిని సంరక్షించే బాధ్యత కూడ తీసుకోవాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని.. అందులో తనను కూడా భాగస్వామి చేసినందుకు సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు రోజా. ఈ కార్యక్రమంలో నగరి విద్యార్థులు, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories