ఆటాడుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా

ఆటాడుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా
x
Highlights

రాజకీయాలు, టీవీ షోలతో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే రోజా శనివారం బ్యాట్ పట్టారు. క్రీజులో దిగి కాసేపు బౌలర్ ను ఆటాడుకున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో...

రాజకీయాలు, టీవీ షోలతో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే రోజా శనివారం బ్యాట్ పట్టారు. క్రీజులో దిగి కాసేపు బౌలర్ ను ఆటాడుకున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీలను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా సరదాగా ఆటగాళ్లతో కలిసి బ్యాటింగ్ చేశారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. క్రీడలు శరీరక సౌష్టవము, మానసిక ఉల్లాసం కొరకు ఉపయోగపడతాయని అన్నారు.

అంతేకాకూండా క్రీడలు పోటీతత్వాన్ని పెంచుతాయని.. తద్వారా జీవితంలో రాణించగలరని ఆమె అన్నారు. కాగా ప్రారంభానికి ముందు టోర్నీలో పాల్గొంటున్న ప్లేయర్లను పరిచయం చేసుకున్నారు. ఈ టోర్నీలో విజయం సాధించిన జట్లకు సంక్రాంతి రోజున బహుమతులను అందజేస్తున్నట్టు ఎమ్మెల్యే రోజా తెలిపారు. నేతలు, ఆటగాళ్ళతో కొద్దిసేపు రోజా సరాదగా గడిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories