logo

క్యాంప్ ఆఫీస్‌లో సీఎం జగన్‌ను కలిసిన రోజా..జగన్‌‌కు ప్రత్యేక...

క్యాంప్ ఆఫీస్‌లో సీఎం జగన్‌ను కలిసిన రోజా..జగన్‌‌కు ప్రత్యేక...

ఏపీఐఐసీ ఛైర్మన్‌‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జగన్‌ను కలిసిన రోజా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నగరి ఎమ్మెల్యే రోజాకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన కేబినేట్‌లో రోజాకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తనను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించినందుకు రోజా సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

లైవ్ టీవి

Share it
Top