ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తా : జనసేన ఎమ్మెల్యే

ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తా : జనసేన ఎమ్మెల్యే
x
Highlights

ఇదివరకే మూడు రాజధానులకు జై కొట్టిన జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. దీనిపై అసెంబ్లీలో ఓటింగ్ జరిపితే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తానని...

ఇదివరకే మూడు రాజధానులకు జై కొట్టిన జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. దీనిపై అసెంబ్లీలో ఓటింగ్ జరిపితే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తానని స్పష్టం చేశారు. జనసేన పార్టీ నిర్ణయం ఎలా ఉన్న తన నిర్ణయంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు, పరిపాలనా వికేంద్రీకరణ పరంగానూ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాపాక అన్నారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం పూర్తిస్థాయి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్‌ చేస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఏకంగా ప్రభుత్వానికి మద్దతు పలకడం సంచలంగా మారింది. కాగా ఇవాళ 11 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. కీలకమైన బిల్లుల తోపాటూ, 13జిల్లాల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసేలా తయారు చేసిన బిల్లును అసెంబ్లీ ఆమోదించనుంది. దీంతో అమరావతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అసెంబ్లీ పరిసరాల్లో సాధారణ ప్రజలను అనుమతించలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories