logo
ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ పై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసల జల్లు

MLA Rapaka Vara Prasada Rao Congratulated CM Jagan
X

సీఎం జగన్ పై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసల జల్లు

Highlights

Rapaka Vara Prasada Rao: సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే

Rapaka Vara Prasada Rao: ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే అన్నారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. రాజోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామ వాలంటీర్లు, సచివాల.య సిబ్బందికి సేవాపురస్కారాలు అందచేసిన ఎమ్మెల్యే రాపాక సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో ఏ సీఎం తీసుకోని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారని చెప్పారు.

జిల్లాల విభజన చేయాలని ముఖ్యంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేయాలని ఎంతో మంది డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టినా ఎవరూ సహసం చేయలేదన్నారు. సీఎం జగన్ జిల్లాల విభజన చేసి ఆ ఘనత దక్కించుకున్నారని రాపాక అన్నారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అంతే కాదు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకు వచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా ఎంతో మంది ఇంజినీర్లు అయ్యారని చెప్పుకొచ్చారు.

Web TitleMLA Rapaka Vara Prasada Rao Congratulated CM Jagan
Next Story