logo
ఆంధ్రప్రదేశ్

Anantapuram: కలెక్టర్‌పై ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

MLA Kethireddy Sensational Comments On Ananthapuram collecter
X

ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి (ఫైల్ ఫోటో)

Highlights

Anantapuram: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్ లెక్కచేయడం లేదు: కేతిరెడ్డి

Anantapuram: అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడుపై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్ చంద్రుడు లెక్కచేయడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. జిల్లాకు మేజిస్ట్రేట్ అయితే మాత్రం చంపేస్తారా అని ప్రశ్నించారు. తన 15 ఏళ్ల రాజకీయ జీవితంలో గంధం చంద్రుడు అంత పనికిమాలిన కలెక్టర్‌ను చూడలేదంటూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ ఇవాళ ఉండి, రేపు పోతాడన్న కేతిరెడ్డి ఎమ్మెల్యేలు గాడిదలు కాయడానికి ఉన్నామా అని ప్రశ్నించారు.

కలెక్టర్ గంధం చంద్రుడు కారణంగా చిల్లవారిపల్లెలో సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన పండుగను జరిపించనందుకు బాధగా వుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. గ్రామంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కలెక్టర్ ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడు ఎలాంటి పని చేయడని, పక్కనోళ్లు చేసిన పని క్రెడిత్ తాను లాక్కుంటారని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 'కిసాన్ అవార్డు' అవార్డు కూడా ఆయన పని చేస్తే వచ్చింది కాదని, జాయింట్ కలెక్టర్ కష్టపడితే గంధం చంద్రుడు క్రెడిట్ కొట్టేశారని వ్యాఖ్యానించారు.

Web TitleAnantapuram: MLA Kethireddy Sensational Comments On Ananthapuram collecter
Next Story