గ్రామాలలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

గ్రామాలలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
x
కాకాణి గోవర్ధన్ రెడ్డి
Highlights

ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు.

నెల్లూరు: ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. కోడెల మిట్ట లో మంచినీటి పథకం, ఊటల బలిజపాలెంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను, పంటపాలెం దళితవాడలో నిర్మించిన వాటర్ ట్యాంక్, గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కాకాణి ప్రారంభించారు.

వైకాపా నాయకులు మారు సుధాకర్ రెడ్డి, ఆలపాక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎమ్మేల్యే కు మంగళ మేళ వాయిద్యాలతో పురోహితులు పూర్ణ కలిశం తో ఘన స్వాగతం పలికారు. వాలంటీర్లు ద్వారా విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. దువ్వూరు వారిపాలెం, డమ్మాయపాలెం గ్రామ విజయోత్సవ సభ లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి, మునుకూరు జనార్థన్ రెడ్డి, నెల్లూరుశివ ప్రసాద్, రాగాల వెంకటేశ్వర్లు, ఈపూరు కోటా రెడ్డి, గిరిధర్ రెడ్డి, దువ్వూరు వెంకట రామిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇసనాక బాలకృష్ణారెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి వసంతకుమార్ రెడ్డి, నంగా చెంగారెడ్డి, తహసీల్దార్ సోమ్ల నాయక్, ఎంపిడిఓ ప్రత్యూష, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories