Bhumana Karunakar Reddy: మూడు రాజధానులకు మద్దతుగా.. ఈనెల 29న రాయలసీమలో మహాఆత్మగౌరవ ప్రదర్శన

Bhumana Karunakar Reddy: శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది

Rama Rao
Published on: 26 Oct 2022 3:52 PM IST
MLA Bhumana Karunakar Reddy Said that the Movement is Starting from Tirupati in Support of the Three Capitals
X

Bhumana Karunakar Reddy: మూడు రాజధానులకు మద్దతుగా.. ఈనెల 29న రాయలసీమలో మహాఆత్మగౌరవ ప్రదర్శన

Bhumana Karunakar Reddy: అభివృద్ది వికేంద్రీకరణ. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది దిశగా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెస్తే ప్రతిపక్షాలు అనవసరమైన గగ్గోలు పెడుతున్నాయన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటకు మద్దతుగా ఈనెల 29న తిరుపతిలో రాయలసమీ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్దిని కోరుకునే వారంతా తిరుపతి వేదికగా నిర్వహించే రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక రాయలసీమ అభివృద్ది మొదలైందన్నారు. దీనిని జగన్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు భూమన. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతి నుంచి ఉద్యమం మొదలు పెడుతున్నట్లు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story