నందికొట్కూరులో ఢీ అంటే ఢీ అంటున్న వైసీపీ నేతలు

నందికొట్కూరులో ఢీ అంటే ఢీ అంటున్న వైసీపీ నేతలు
x
Highlights

కర్నూలు జిల్లా నందికొట్కూరు.. ఫ్యాక్షన్స్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు బైరెడ్డి, గౌరు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. వీరిద్దరూ వేరే...

కర్నూలు జిల్లా నందికొట్కూరు.. ఫ్యాక్షన్స్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు బైరెడ్డి, గౌరు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. వీరిద్దరూ వేరే వేరే పార్టీలలో ఉంటూ రాజకీయం చేశారు. కానీ ప్రస్తుతం వైసీపీలో వింత పరిస్థితి ఏర్పడింది. ఒకే పార్టీలో ఉన్న రెండు గ్రూపులు ఆధిపత్యం కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒకరేమో ఎమ్మెల్యే అయితే మరొకరు పార్టీ తరుపున ఇంచార్జ్ గా ఉన్నారు. ఎమ్మెల్యే తోగూరు ఆర్ధర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో సిద్ధార్థరెడ్డి పెత్తనాన్ని భరించలేక ఎమ్మెల్యే ఆర్ధర్ కు విసుగొచ్చింది. దాంతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆరునెలకే ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయలేను అనేంతలా ఆయన విరక్తి చెందారు. ప్రజలెవ్వరూ సిద్ధార్థరెడ్డి దగ్గరకు వెళ్లకుండా తనవద్దకే రావాలని ఎమ్మెల్యే కోరుతున్నా వినకపోయేసరికి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఆధిపత్యం విషయంలో ఇటీవల ఇరువురు వర్గాలు కూడా గొడవకు దిగాయి. దాంతో రెండు వర్గాలకు సర్ది చెప్పారు జిల్లా నేతలు. అయినా కొద్ది రోజుల నుంచి మళ్ళీ విబేధాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఎమ్మెల్యేగా తాను ఉన్నా ఏమి చేయలేకపోతున్నానన్న అభిప్రాయం ఆర్ధర్ లో ఉందట. ఇటు సిద్ధార్థరెడ్డి కూడా నియోజకవర్గంపై మరింత పట్టు సాధించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. దీంతో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినబడుతోంది. మరో భవిశ్యత్ లో ఏమి జరుగుతుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories