MLA Arava Sridhar Controversy: అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో మలుపు.. బాధితురాలి కొత్త వీడియో సంచలనం

MLA Arava Sridhar Controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంలో మరో మలుపు. హనీ ట్రాప్ ఆరోపణలను ఖండిస్తూ బాధితురాలు మరో వీడియో విడుదల చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Feb 2026 11:42 AM IST
MLA Arava Sridhar Controversy: అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో మలుపు.. బాధితురాలి కొత్త వీడియో సంచలనం
X

MLA Arava Sridhar Controversy: అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో మలుపు.. బాధితురాలి కొత్త వీడియో సంచలనం

MLA Arava Sridhar Controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వివాదం రోజురోజుకు మరింత హీటెక్కుతోంది. ఇప్పటికే హనీ ట్రాప్ ఆరోపణలతో చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంలో తాజాగా మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే వర్గం చేసిన ఆరోపణలను ఖండిస్తూ బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు.

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను తాను హనీ ట్రాప్ చేశానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బాధితురాలు స్పష్టం చేశారు. హనీ ట్రాప్ చేయాలంటే ఏడాదిన్నర కాలం వేచి చూడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక్కరోజులోనే ఆ పని చేసి డబ్బులు డిమాండ్ చేయవచ్చని, కానీ తాను అలా చేయలేదని వీడియోలో పేర్కొన్నారు.

ఇక మరోవైపు, బాధితురాలు సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యానని చెప్పి డబ్బులు వసూలు చేసిందని ఎమ్మెల్యే తల్లి ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. UPSCలో సెలక్ట్ అయ్యానని చెప్పి ఫేక్ ఇంటర్వ్యూ లెటర్‌, సివిల్స్ మెయిన్ పరీక్ష హాల్ టికెట్ చూపించిందని కంప్లయింట్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా విడుదల చేసినట్టు ఎమ్మెల్యే వర్గం వెల్లడించింది.

ఈ ఆరోపణలపై స్పందించిన బాధితురాలు.. తనకు జరిగిన ఘటనలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. తనకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చిందన్న విషయాన్ని డాక్టర్లు నిర్ధారిస్తారని పేర్కొన్నారు. అసలు విషయాన్ని పక్కనపెట్టి జనసేన నేత నాగేంద్ర ఈ అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ మరో వీడియో విడుదల చేశారు.

ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పటివరకు ప్రత్యక్షంగా స్పందించకపోవడంపై బాధితురాలు ప్రశ్నలు లేవనెత్తారు. తాను హనీ ట్రాప్ చేసి 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు నిరూపించాలని ఎమ్మెల్యే వర్గానికి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే స్వయంగా స్పందించే వరకు ఈ వివాదం కొనసాగేలా కనిపిస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story