వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

X
ఫైల్ ఇమేజ్
Highlights
విజయనగరం జిల్లా వైసీపీలో విభేదాలు తలెత్తాయి. మంత్రి బొత్స సోదరుడు లక్ష‌్మణరావుపై ఎమ్మెల్యే అప్పలనాయుడు తీవ్ర స్...
Sandeep Eggoju8 Feb 2021 7:21 AM GMT
విజయనగరం జిల్లా వైసీపీలో విభేదాలు తలెత్తాయి. మంత్రి బొత్స సోదరుడు లక్ష‌్మణరావుపై ఎమ్మెల్యే అప్పలనాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లక్ష్మణరావు టీడీపీతో కలిసి నియోజకవర్గంలో రాజకీయ సంక్షోభం తెస్తున్నారని ఆరోపించారు అప్పలనాయుడు. డబ్బులిచ్చి మరీ ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుంటున్నారన్నారు. సోదరుడిని కంట్రోల్ చేయలేకపోతున్నారని అటు మంత్రి బొత్స సత్యనారాయణపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు అప్పలనాయుడు. ఈ విషయంపై ఎన్నికల తర్వాత అధిష్టానానికి ఫిర్యాదు చేసి అటో ఇటో తేల్చుకుంటానన్నారు.
Web TitleMLA Appalanaidu Fire on Minister Botsa Satyanarayana Brother Laxman Rao
Next Story