సీటు మార్చాలని ఆనం వ్యాఖ్యలు.. ఆనం మాటలకు నవ్వుకున్న సీఎం జగన్..

సీటు మార్చాలని ఆనం వ్యాఖ్యలు.. ఆనం మాటలకు నవ్వుకున్న సీఎం జగన్..
x
ఆనం రామనారాయణరెడ్డి
Highlights

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆందోళన చేస్తారా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నేత అరాచక శక్తులు అన్న పదం వాడడం గౌరవ పదం కాదని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. తన సీటు వద్దకు వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారని.. తన సీటు మార్చాలని ఆనం స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్ష నాయకులు తమ వద్దకు వచ్చి మాట్లాడుతుంటే.. నేనేం మాట్లాడుతానని ఆనం ఆరోపించారు. అయితే ఆనం మాట్లాడుతున్నంత సేపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్వుతూనే ఉన్నారు. అరాచక శక్తులు అన్న పదాన్ని తొలగించాలని స్పీకర్‌ను ఎమ్మెల్యే ఆనం కోరారు. చంద్రబాబును ఉపసంహరించుకోమని చెప్పాలన్నారు. అరాచక శక్తులన్న పదాన్ని రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories