
ఈరోజు 11 గంటలకు వాస్తవాలు బయటపెడతా : ఎమ్మెల్యే ఆర్కే ఈరోజు 11 గంటలకు వాస్తవాలు బయటపెడతా : ఎమ్మెల్యే ఆర్కే
వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబునాయుడు ఉంటున్న ఇంటికి పంచాయితీ రాజ్ అన్ని అనుమతులు ఇచ్చిందన్న లింగమనేని వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ విషయంలో చర్చకు సిద్ధమని.. బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈరోజు 11 గంటలకు మీడియా సమావేశం పెట్టి వాస్తవాలు బయటపెడతానని స్పష్టం చేశారు. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లింగమనేని రమేష్ లేఖ రాశారు. తన ఇంటికి పంచాయితీ అన్ని అనుమతులు ఇచ్చిందని కూల్చే అధికారం లేదని లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా ఈ ఇంటికి సీఆర్డీఏ అనుమతులు ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



